

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామపంచాయతీ ప్రాంగణంలో,మండల తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బిక్షపతి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో గంగాధర్, మండల విద్యా వనరుల కార్యాలయంలో తిరుపతిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ప్రత్యేకంగా హాజరై,ప్రజాస్వామ్య విలువల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ప్రసంగించారు.1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు రాచరిక పాలనను దాటుకుని స్వేచ్ఛా ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రారంభించిన చారిత్రాత్మక ఘట్టాన్ని జ్ఞాపకంగా ఉంచిన దినోత్సవం అని ఆయన తెలిపారు. ప్రజలు స్వేచ్ఛాపరమైన పాలనలో జీవించే హక్కును సాధించిన గొప్ప క్షణం అందరికీ జ్ఞాపకం చేయాల్సిన ఘన సందర్భమని ఆయన ఉద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
