

వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబు
శంఖవరం/ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి :-ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి యువత ముందుకు రావాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. కిర్లంపూడి లో మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసంలో శంఖవరం మండలం కత్తిపూడి వైసీపీ నాయకులు అడపా సోమేష్ ఆధ్వర్యంలో కత్తిపూడి గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలు వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబును కలిశారు. గిరిబాబు మాట్లాడుతూ పార్టీలో కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా కల్పించారు. నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ఎక్కడ ఆదరణ తగ్గలేదని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలు మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సప్పా రాంబాబు, కీర్తి విజయ్, కీర్తి వెంకన్న, ప్రగడా చిన్ని, గౌతు కృష్ణ, ఎర్రం శెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు .