తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. స్వామి వారిని దర్శించుకుంటే చాలు.. అడిగినన్నీ లడ్డూలు

మన న్యూస్ :- ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయమే తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ టెంపుల్‌కి కనీసం 30 వేల నుంచి 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అదే కొత్త సంవత్సరం రోజున అయితే.. ఏకంగా 75 మందికి పైగా ఆలయానికి దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ప్రత్యేకత కారణంగానే తిరుపతి ఆలయం అనేది ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా వరల్డ్ రికార్డు సైతం స్థానాన్ని సంపాదించుకుంది. ఇక దేవాలయానికి ఎంత విశిష్టత ఉందో.. తిరుమల లడ్డూకి కూడా అంతే ప్రత్యేకత ఉంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరుని పేరు చెప్పగానే లడ్డూ ప్రసాదం గుర్తొస్తుంది. తిరుమల వెళ్లాం అనే చెప్పగానే ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న ఒక్కటే.. లడ్డూ ఎక్కడా అని.. తిరుమల ఆలయంలో తయారు అయ్యే ఈ లడ్డూకి ఎందరో ప్రియులు ఉన్నారు. వడ నుండి చక్కెర పొంగలి వరకు శ్రీవారి ప్రసాదాలు ఎన్నున్న లడ్డూకు మాత్రం ఎప్పటికి తిరుగులేదు. ఇలా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ లడ్డూని తిననిదే తమ తిరుమల పర్యటన పూర్తికాదని భావిస్తారు భక్తులు. తిరుపతి లడ్డూని బ్లాక్‌లో కొనడానికి కూడా ఏమాత్రం వెనకడుగు వేయరంటే ఈ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యతను ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఎన్నో ప్రసాదాలు ఉన్న తిరుమల లడ్డూకి ఉన్నప్రాముఖ్యతే వేరు. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఏవిధంగా అయితే క్యూలో నిలబడతారో.. లడ్డూ కోసం కూడా అదే స్థాయిలో నిలబడతారు.ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం.. భక్తులకు ఓ తీపికబురు చెప్పింది. ఇకపై భక్తులు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా లడ్డూల తయారీకి అవసరమైన 84 మంది పోటు సిబ్బంది నియామానికి కూడా చర్యలు మొదలెట్టినట్లు తెలుస్తోంది. తిరుమలలో ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6 వేల కల్యాణం లడ్డూలు, 3వేల500 వడలు తయారు చేయిస్తోంది. తిరుమలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ స్వామి ప్రసాదాన్ని అందజేస్తున్నారు. అయితే సాధారణంగా దర్శనం చేసుకున్న భక్తులకు చిన్నలడ్డు ప్రసాదంగా ఇస్తారు. రోజుకు సరాసరి 70 వేల మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఉచిత లడ్డూలే 70 వేలు ఇవ్వాలి. వీటితో పాటు భక్తులు తమ బంధువులు, చుట్టుపక్కల ఉన్నవారికి శ్రీవారి ప్రసాదాన్ని ఇచ్చేందుకు అదనంగా మరికొన్ని కొనుగోలు చేస్తుంటారు.సాధారణ రోజుల్లో ఇబ్బంది లేకపోయినా.. వీకెండ్స్‌, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయంలో డిమాండ్‌ అధికంగా ఉంటోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని చిన్న లడ్డూలు, నాలుగు వేల వరకు పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.

Related Posts

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..