

మన ధ్యాస ,నెల్లూరు ,ఆగస్టు 29 :నెల్లూరు ఆచార వీధిలో శుక్రవారం సినీనటి నేహా శెట్టి ఇమ్మడి సిల్వర్ జువెలరీ షోరూమ్ ను ప్రారంభించినారు. సినీనటి నేహా శెట్టి సింహపురి మహిళలను ,యువతను పలకరిస్తూ సందడి చేశారు .ఆమె జువెలరీ షోరూమ్ లో ఆభరణాలను సింహపురి మహిళ లోకానికి పరిచయం చేస్తూ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ……. ఇమ్మడి సిల్వర్ జువెలరీ షోరూం సింహపురి మహిళలను సందర్శించి ఆదరించాలని కోరారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇమ్మడి సిల్వర్ జూలరీను కు సందర్శించి షాపు యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్తలు, నగర ప్రముఖులు, సింహపురి మహిళలు తదితరులు పాల్గొన్నారు.
