



మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బొగ్గుగుడిసె–బాన్సువాడ, నిజాంసాగర్ రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో అలాగే నిజాంసాగర్ ప్రాజెక్టు విడుదలైన నీటి ప్రభావంతో చిన్నపూల్ బ్రిడ్జి వద్ద పరిస్థితిని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.ఎస్పీ వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి,భారీ వర్షాల కారణంగా భవనం కొంతవరకు దెబ్బతిన్నదని,పరిసరాల్లో నీరు నిల్వ ఉన్న విషయాన్ని గమనించి వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.నిజాంసాగర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుమారు 78 మందిని గోర్గల్ సొసైటీ ఫంక్షన్ హాల్ లో పునరావాస కేంద్రంలో ఉంచగా ఎస్పీ రాజేష్ చంద్ర వారిని కలసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.వారికి పండ్లు అందజేశారు.
వర్షకాలంలో పోలీసులు అందిస్తున్న సేవలను ప్రజలు ప్రశంసిస్తూ ఎన్నో ప్రాణాలు మీ చేతుల మీదుగా కాపాడబడ్డాయిఅంటూ ఎస్పీ రాజేష్ చంద్రకు కృతజ్ఞతలు తెలిపారు.ఎస్పి వెంట డీఎస్పీ విఠల్‌రెడ్డి సీఐలు తిరుపతయ్య, రాజారెడ్డి,నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ ఉన్నారు.


