పాఠశాలల విద్యార్థులకు సురక్షిత ప్రాంతాలకు తరలింపు..

మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు వాడి దగ్గర ద్వారా నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో
శుక్రవారం ఉదయం వరద పోటు తగ్గడంతో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు దృష్టికి తీసుకెళ్ళడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి నిజాంసాగర్ చేరుకొని ఆదర్శ పాఠశాల 90 మంది విద్యార్థినులను కస్తురిబా గాంధీ బాలికల పాఠశాల వసతి గృహానికి ప్రైవేటు బస్సు ఏర్పాటు చేసి తరలించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి విద్యార్థినుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని కస్తురిబా గాంధీ విద్యాలయం నుండి విద్యార్థినులను తల్లి దండ్రులు విద్యార్థినులను ఇంటికి తీసుకెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, తహసిల్దార్ బిక్షపతి, ఎంపిడిఓ గంగాధర్, ప్రిన్సిపాల్ కార్తిక సంధ్య, మహమ్మద్ నగర్ ఎంఈఓ అమర్ సింగ్, ఎస్ఐ శివకుమార్, నాయకులు అనీస్ పటేల్, బంజారా సేవ సంఘం జనరల్ సెక్రటరీ విస్లావత్ గోపి నాయక్, బాన్సువాడ ఆర్డీవో కార్యాలయ టెక్నికల్ మేనేజర్ జగన్ గౌడ్, అజారుద్దీన్, అబ్దుల్ జమిల్, అయిటి రాజు, రాము రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..