మన ధ్యాస, కావలి ,ఆగస్టు 25 :నెల్లూరు జిల్లా,కావలి పట్టణం 6వ వార్డులోని కొనదిన్నె గిరిజన కాలనీలో అధికారులతో కలిసి సోమవారం ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి చేతుల మీదుగా నూతన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ……..ఎన్నికల్లో మొదటి సారిగా కొనదీన్నే గిరిజన కాలనికి వచ్చాను .స్మార్ట్ రేషన్ కార్డులు కూడా ఇక్కడే అందిస్తున్న..చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.కొనదీన్నే గిరిజన కాలని అభివృద్ధిలో అన్ని విధాలుగా అండగా ఉంటాము అని అన్నారు.మంచి ప్రభుత్వం,చెప్పింది చెప్పినట్టుగా హామీలు అమలు చేస్తోంది అని అన్నారు.అన్నిటికీ రేషన్ కార్డు ముడిపడి ఉంది.వైసీపీ ప్రభుత్వం ర్రాష్టాన్ని విధ్వంసం చేసింది అని అన్నారు.టీడీపీ ని గెలిపించి ప్రజలు మంచి పని చేసారు .మహిళలు గౌరవించే ప్రభుత్వం టీడీపీ.ప్రభుత్వం ప్రతి రూపాయి ,పధకాలు మహిళలు అందిస్తుంది అని అన్నారు.రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్న అనేక పథకాలు ,అబివృద్ధి దిశగా పయనిస్తుంది అని అన్నారు.త్వరలో కాలనీలు మంజూరు అవుతాయి..రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుంది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *