మన ధ్యాస ,ముత్తుకూరు, ఆగస్టు 25 :ముత్తుకూరు మండలం కప్పలదొరువు వద్ద ప్రణీత్ ఆథరైజ్డ్ ఫిట్ నెస్ (ఏటీఎస్) సెంటరును సోమవారం ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి.ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ………………….నెల్లూరు జిల్లాలోని అన్ని కమర్షియల్ వాహనాల ఫిట్ నెస్ కు చెక్ చేసే కేంద్రం సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం సంతోషదాయకం అని అన్నారు.ఇప్పటివరకు జరుగుతున్నఫిట్ నెస్ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న లోపాల కారణంగా సామర్థ్యంలేని వాహనాలు కూడా ఎఫ్.సి పొంది ప్రమాదాలకు కారణమవుతున్నాయి అని అన్నారు.ఈ లోపాలన్నింటిని అరికట్టి పక్కా పారదర్శకంగా ఎఫ్.సీల జారీకి అత్యాధునిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు అని తెలిపారు.నూతన విధానంలో వాహనాలకు 30 రకాల పరీక్షలు నిర్వహించి ఫిట్ నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు అని అన్నారు.ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ అత్యాధునిక వ్యవస్థ అమలులోకి వచ్చింది అని అన్నారు.ఈ ఫిట్ నెస్ సెంటర్ విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాను. నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *