

మన న్యూస్, కావలి :ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి మద్దతుగా మేము సైతం అంటూ…!*9. వ మైలు సెంటర్ లో కదం తొక్కిన మహిళలు,టిడిపి శ్రేణులు,గ్రామస్తులు ..!*మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ని వెంటనే అరెస్టు చేయాలి…!టిడిపి నాయకులు డిమాండ్ మన న్యూస్ ,కావలి ,ఆగస్టు 22:కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకే కావలిలో హత్య రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని జలదంకి మండల మాజీ టిడిపి నాయకులు డిమాండ్ చేశారు.కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి పై హత్యాయత్నానికి నిరసనగా జలదంకి మండలం 9వ మైలు సెంటర్లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దిష్టిబొమ్మతో భారీ శవయాత్ర చేసి దహనం చేశారు.కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కి చెందిన అన్నవరం క్వారీలో మాజీ ఎమ్మెల్యే కొంతమందిని రౌడీలను తీసుకువచ్చి తన అనుచరుల తో డ్రోన్ కెమెరా ద్వారా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆచూకీ తెలుసుకొని హత్య చేయించాలనుకోవడం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ హత్య ప్రయత్నం చేసిన ప్రధాన సూత్రధారైన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


