బెల్టు షాపులపై ఎక్సైజ్ అధికారులకు ప్రేమేందుకో….?రైడ్ చేయటానికి జంకుతున్నఎక్సైజ్ శాఖ.? గ్రామాలలో 3పెగ్గులు,6 గ్లాసులుగా బెల్ట్ షాపులు..////

ఉదయగిరి మన న్యూస్ ప్రతినిధి నాగరాజు:///

ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు,మండలం, భైరవరం, వరికుంటపాడు మండలం, జి కొండారెడ్డిపల్లి, గువ్వాడి ,ఉదయగిరి మండలం అప్పసముద్రం,గ్రామాల,పల్లెల్లో బెల్ట్‌షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, మారుమూల గ్రామాలు మత్తులో జోగుతున్నాయి. గ్రామాలు, తండాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్‌ దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అనేక మంది బెల్ట్‌ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కాపురాలు వీధిపాలవుతున్నాయి.ఎనీ టైం మద్యం…?అక్రమ బెల్టు దుకాణాలతో, పలు గ్రామాల్లో పల్లెల్లో మద్యం మందు బాబులకు చేరువైంది. కొన్ని గ్రామాలలో మద్యం డోర్ డెలివరీ కూడా అమలు చేస్తున్నారని సమాచారం. బెల్ట్ షాపుల్లో 24 గంటలు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మందుబాబులు తెల్లవారుజాము నుంచే, ఆయా గ్రామాల షాపుల వద్ద బహిరంగనే మద్యం సేవిస్తున్న, అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. బెల్ట్ షాపు ద్వారా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అమ్మేవారు కూడా, తాము అధికారులను, ప్రసన్నం చేసుకునే విక్రయాలను జరుపుకుందామని చెబుతుండడం విశేషం..! బెల్ట్ దుకాణాల బెడదపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని, ఆయా ప్రాంతాల ప్రజలు, మండిపడుతున్నారు. బెల్ట్ షాపులు యదేచ్చగా నడుస్తున్న మొక్కుబడి కేసులతో ఎక్స్చేంజ్ అధికారులు సరిపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దాడుల్లో పట్టుబడ్డ మద్యం ఏ షాపుల్లో నుంచి వచ్చిందో, మూలాలను కనుక్కొని వాటిపై చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందిస్తారు లేదో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది..?పేరుకే కిరాణం.. అమ్మేది మద్యమే..!అనేకమంది పేరుకు కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. సొంత ఇళ్లలో పెద్ద ఫ్రిడ్జులు పెట్టుకొని మరీ విక్రయిస్తున్నారు. వైన్‌షాపుల యజమానులు కారుల ద్వారా మద్యాన్ని ఊరూరా సరఫరా చేస్తున్నారు. తమకు కేటాయించిన గ్రామాలకు నిత్యం కారుల ద్వారా పంపించి అమ్ముతున్నారు. మద్యం మత్తులో ఇళ్ల మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్ట్‌ షాపుల కారణంగా మద్యం ఏరులై పారుతోంది.పచ్చని సంసారాల్లో చిచ్చు…!మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. ఊరూరా బెట్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీంతో పొద్దంతా పనిచేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తుండటంతో యువత పెడదారి పడుతోన్నారు. ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు విపిస్తున్నాయి.పనికి వెళ్లకుండా పగలే తాగుతున్నారు
ఊళ్లో బెల్ట్‌షాపులు ఏర్పాటు కావడంతో చాలా మంది పనికి వెళ్లకుండా పగలే తాగుతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. పట్టించు కోవాల్సిన ఎక్స్చేంజ్ శాఖ అధికారులు పత్తా లేకుండా పోయారు. దీంతో పరిస్థితి దారుణంగా మారింది..బెల్ట్‌షాపులపై చర్యలు తీసుకోవాలి…!మా ఊళ్లో బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేశారు. కిరాణ షాపుల్లో మద్యం అమ్ముతున్నారు. దీంతో గ్రామంలో గొడవలు జరుగుతున్నాయి. పచ్చని సంసారాలు నాశనం అవుతున్నాయి. అధికారులు స్పందించాలి. బెల్ట్‌షాపులు గ్రామంలో లేకుండా చర్యలు తీసుకోవాలి..సీఎం ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న అధికారులు..?అక్రమ బెల్ట్ షాపులను నిర్వహించేవరకు కఠిన చర్యలు తీసుకోవాలని, కచ్చితంగా కేసులు బుక్ చేయాలని, సీఎం చంద్రబాబు నాయుడు సూచించిన, అక్రమ బెల్ట్ షాప్ లో ఉపేక్షించేది లేదని ఎన్నో సమావేశంలో తెలిపారు. కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ అధికారులు తీరుపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

  • Related Posts

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    అనంతపురం,సెప్టెంబర్ 10 : (మనద్యాస న్యూస్) ప్రతినిధి : నాగరాజు ://///// రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అనంతపురంలో బుధవారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు