

మన న్యూస్: మహేశ్వరం నియోజకవర్గం అల్మాస్గూడ లోని శ్రీ శ్రీ హోమ్స్ లో మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం ను శ్రీశ్రీ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్ అభ్లాష్ రెడ్డి,డాక్టర్ సాయి సుధా రెడ్డి,డాక్టర్ హరీష్ పాల్గొని వైద్య సేవలు అందించారు.ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 150 నుండి 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్స్ అందజేశారు.ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంకు సహకరించిన ప్రతి ఒక్కరికి తమ ధన్యవాదాలు తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించి అల్మాస్గూడ పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మరింత దగ్గర చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ సభ్యులు రమేష్, శ్రీకాంత్,రామారావు,సురేష్,గణేష్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
