

గూడూరు, మన న్యూస్ :- కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే భారత ఎన్నికల కమిషన్ పై అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రధానమంత్రి మోడీ పాలనను చూసి ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్నాయని గౌడ్ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ సెక్రెటరీ శివ నాగేశ్వరరావు గౌడ్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ సెక్రెటరీ శివ నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ దేశ అభివృద్ధికినే నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై భారత ఎన్నికల కమిషన్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని దీని ఖండిస్తున్నామని అన్నారు ప్రపంచ దేశాల్లో కెల్లా భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లేందుకు మోడీ ఎంతో శ్రమిస్తున్నారని ప్రపంచ దేశాలే ఆయనకు ఎంతో గౌరవం ఇస్తున్నారని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదని ఈరోజు నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని ఇప్పటికైనా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు ఈ సమావేశంలో మిరియాల వెంకటరామయ్య ,శ్రీనివాసులు గౌడ్ ,మోహన్, శ్రీరామ్ ,తదితరులు పాల్గొన్నారు .
