

వింజమూరు,ఆగస్టు13:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
వింజమూరు మండలం బుక్కాపురం గ్రామానికి, పల్లె వెలుగు ప్రయాణం కల నెరవేరింది. ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్, సహకారంతో, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, సౌజన్యంతో, ఉదయగిరి, ఆత్మకూరు డిపో మేనేజర్, శివ కేశవ్ యాదవ్, ఆదేశాలతో వింజమూరు టు ఆత్మకూరు వయా బుక్కాపురం మీదుగా, ఉదయం, సాయంత్రం రెండు పర్యాయాలు, గ్రామంలోనికి పల్లె వెలుగు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. బుధవారం అధికారుల ఆదేశాలతో బుక్కాపురం గ్రామానికి చేరుకున్న ఆర్టీసీ బస్సుకు, సర్పంచ్ రసూల్, ఉప సర్పంచ్ కాటం రమణారెడ్డి గ్రామస్తులు పూజల నిర్వహించారు. బస్సును అరటి బోదేలు ,మామిడి తోరణాలతో అలంకరించారు. కో క్లస్టర్ కన్వీనర్ పాములపాటి మాల్యాద్రి కొబ్బరికాయ కొట్టి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం లో గ్రామస్తులు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ, వారి కోరిక నెరవేరలేదు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి గ్రామస్తులు, గ్రామ మరియు మండల నాయకుల సహకారంతో విన్నవించగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బుక్కాపురం గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారని, తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి, చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారికి, డిపో మేనేజర్ శివ కేశవ్ యాదవ్ గారికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ బస్సు సౌకర్యం విద్యార్థులకు మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. సహకరించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిందని, ఆగస్టు 15 నుండి స్త్రీ శక్తి పేరుతో మహిళలందరికీ ఉచిత ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లక్ష్మీనారాయణ, గడ్డం శ్రీనివాసులురెడ్డి, కామినేని లక్ష్మీనారాయణ,బాలకృష్ణ, శ్రీను, మస్తాన్, దొరస్వామి నాయుడు, విజయ,తదితరులు ఉన్నారు.