

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరంలో దాకమర్రి లోవరాజు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కమ్యూనిటీ హాల్లో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య అధ్యక్షతన బీసీ ఉపకులాలకు సంబంధించిన నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అలమండ చలమయ్య మాట్లాడుతూ బీసీ సోదరుల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీలకతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు.ఏలేశ్వరం జనాభాలో సగానికి పైగా ఉన్న బలహీనవర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేయడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వారికి సహాయం చేయడానికి తాము పని చేస్తామని మీడియాకు తెలిపారు.పార్టీల ఆతీతంగా అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఐక్యతను చాటడానికి తామందరూ సిద్ధంగా ఉన్నామని పలు బీసీ సంఘాల నాయకులు ఈ సమావేశంలో తీర్మానించుకున్నట్లు తెలిపారు.