

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం :ఏలేశ్వరం నగర పంచాయతీ నందు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు గీతా జయంతి మహోత్సవాల్లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవద్గీత పోటీలను నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.పోటీల్లో గెలుపొందిన వారికి నాయకుల చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య,వైస్ చైర్మన్ మసిరపు బుజ్జి నాగేశ్వరరావు,నాయకులు బూర్లు సత్తిబాబు, నీలాంబరరావు,జామి ఆదినారాయణ,విశ్వ హిందూ పరిషత్ ఏలేశ్వరం ప్రఖండ్ అధ్యక్షులు అలమండ దుర్గావెంకట ప్రసాద్,కటకం కిరీటి,తూమురౌతు గురవయ్య, మరియు విశ్వ హిందూ పరిషత్ మహిళా ప్రఖండ్ సభ్యులు పాల్గొన్నారు.