

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగష్టు 8:
నిజాంసాగర్ మండల కేంద్రంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఒకరినొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం నిజాంసాగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు అరటిపండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ గౌస్, వెంకా గౌడ్, భూమా గౌడ్, శేఖర్, కర్ణం శ్రీనివాస్, చిట్యాల రామకృష్ణ, చిట్యాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.