

మన న్యూస్ సాలూరు ఆగస్టు 7 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు కి మున్సిపల్ కమిషనర్ గా టి. టి రత్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం జీవీఎంసీ లో ప్రాజెక్ట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న రత్నకుమార్ కు సాలూరు మున్సిపల్ కమిషనర్ గా పదోన్నతిపై గురువారం విచ్చేసారు. ఇంతవరకు ఎఫ్ఏసి కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న డిఈ ప్రసాద్ తన బాధ్యతలను టీటీ రత్నకుమార్కు అప్పగించారు. మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న ఆయనకు మున్సిపల్ సిబ్బంది పూల బుకేలతో స్వాగతం పలికారు.