ఉదయగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఉదయగిరి గ్రామంలోవిశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో,శ్రీ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం,,
తేదీ.9-8-2025. శనివారం
ఉదయగిరి శ్రీ రంగనాయకుల స్వామి దేవస్థానం నందు వరుడు: శ్రీ వెంకటేశ్వర స్వామి
వధువు : శ్రీదేవి భూదేవి
స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగును.బిజెపి నేత భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా కిసాన్ మోర్చా మాజీ ఉపాధ్యక్షులకు విశ్వ హిందూ పరిషత్ ఉదయగిరి ప్రఖండ శ్రీనివాస రావు గారు ఈరోజు శ్రీనివాస కళ్యాణానికి రావాలంటూ ఆహ్వానం అందించడం జరిగిందని తెలియజేశారు.కావున ఈ దైవ కార్యక్రమంలో హిందూ బంధువులు పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి శ్రీవెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం స్వీకరించి కరుణ కృప కటాక్షములు అందుకొని తరించవలసిందిగా కోరుతున్నాము అని వారు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి ఆవులు రోశయ్య బిజెపి ఉదయగిరి ప్రధాన కార్యదర్శి కార్తీక్ దుత్తలూరు మోడల్ స్కూల్ చైర్మన్ సింగవరపు సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *