
మన న్యూస్, నెల్లూరు ,ఆగస్టు 1: పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనాలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టామని ఇండియన్ రైల్వేస్, సౌత్ స్టార్ రైల్వే మరియు టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ తెలిపారు.నెల్లూరు ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మహాలయ ప్రత్యేక సప్త మోక్ష యాత్ర క్షేత్ర యాత్ర సెప్టెంబర్ 9 ,2025 ప్రారంభం అవుతుందన్నారు. ఈ రైలు గూడూరు, నెల్లూరు ,ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ ,హైదరాబాద్, కాజీపేట స్టేషన్లో యాత్రికులు రైలు ఎక్కే వీలుందన్నారు.ఈ యాత్ర 15 రోజులు సాగుతుందన్నారు. ఇండియన్ రైల్వేస్, భారత గౌరవ టూరిస్ట్ రైలు, సౌత్ స్టార్ రైలు ,భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన అగ్రశేని టూరిస్ట్ రైలు ఆపరేటర్ టూ టైమ్స్ యాత్రకు నడుం బిగించిందన్నారు.ఈ యాత్ర లో ఉజ్జయిని ,ఓంకారేశ్వర్, ద్వారక ,సిద్ధ పూర్ ,మధుర ,అయోధ్య, ప్రయోగ రాజ్ ,వారణాసి ,గయ వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తుందని తెలిపారు.గతంలో ఇండియన్ రైల్వేస్ టూర్ టైమ్స్ ప్యాకేజ్ కు విశేష స్పందన లభించింది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , తమిళనాడు రాష్ట్రాల నుంచి 650 మంది యాత్రికులతో పుణ్యక్షేత్రాలు యాత్ర విజయవంతంగా నిర్వహించిందన్నారు. అనంతరం టూర్ టైమ్స్ జనరల్ మేనేజర్ సంతోష్ మాట్లాడుతూ……. ప్రాచీన గ్రంధాలు, పురాణాల ప్రకారం యాత్రలో ఉన్న క్షేత్రాలు ఎంతో పేరుగాంచినవి అని అన్నారు. ఇవి మానవ శరీరంలోని వివిధ శక్తి కేంద్రాలను తెలియచేస్తాయి అని అన్నారు.అవి అయోధ్య (మనసు), మధుర (హృదయం), కాశి (సహస్ర చక్రం), ఉజ్జయిని (నాభి ),ద్వారక( పాదాలు) గయ( పితృ మోక్షస్థలం) ,మాతృ గయ( మాతృ మోక్షస్థలం) అని తెలియజేశారు. ఈ ప్రత్యేక టూరిస్ట్ రైలు యాత్రికులకు పలు అనుభవాలను అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. రైలు లోపల, బయట దక్షిణ భారత భోజనం అందుబాటులో ఉంటుందన్నారు. లగేజ్ భారం ఉండదన్నారు. దర్శనానికి అవసరమైన బ్యాగు మాత్రమే మోయాల్సి ఉంటుంది అన్నారు . ఈ ప్యాకేజీ పై ఇండియన్ రైల్వే 33% సబ్సిడీ ఇస్తుందన్నారు. థర్డ్ ఏసి (కంఫర్ట్ ) రూ 45 ,750; సెకండ్ ( డీలక్స్ ) రూ 54,100 ; ఫస్ట్ ఏసి (లగ్జరీ) రూ 69 ,500 చార్జీలు ఉంటాయని అని అన్నారు.యాత్ర టికెట్లను ఈ సెల్ నెంబర్ కు 9355021516 కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అని తెలియజేశారు. ఆన్ లైన్ బుకింగ్ కోసం డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు .టూర్ టైమ్స్ . ఇన్ సందర్శించవచ్చున్నారు .ఈ సమావేశంలో టూర్ టైమ్స్ మేనేజర్ యాకేష్ పాల్గొన్నారు. ఆసక్తి గల వారు రండి భారత పుణ్యక్షేత్రాలను దర్శించండి అని తెలియజేశారు.
