

మన న్యూస్: త్రిబుల్ ఆర్ గా ఖ్యాతి గడించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభాపతి రఘు రామకృష్ణమ రాజును తిరుమల తిరుపతి దేవస్థానం క్షత్రియ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపకులు రుక్మాంగదరాజు రుద్రరాజు గురు ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో తితిదే ఉద్యోగులు గురువారం రాత్రి తిరుమలలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గురు ప్రసాద్ రాజు, రుక్మాంగద రాజు, గోపి నాద్ రాజు, నాగరాజు, వెంకట మునిరాజు, సత్య సాయి రాజు, గిరిరాజు, మధు శేఖర్ రాజు, గోవర్ధన్ రాజు, శంకర్ రాజు, దినకర్ రాజు, రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుండ్రాజు సుకుమార్ రాజు పాల్గొన్నారు.