ఉరవకొండ మన న్యూస్:ఉరవకొండ మండలం లోని బూదగవి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అక్రమంగా నిర్భందించారు. మెహరం పండుగ సందర్బంగా వీరు అగ్ని గుండం చుట్టూ వీరు ప్రతిపక్ష ఫోటో పట్టుకొని చిందులు వేశారనే ఆరోపణలున్నాయి. అయితే అధికారు పార్టీకి చెందిన కార్యకర్తలు సైతం చిందులు వేశారు. పదిహేను రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది. అయితే ముగ్గురు యువకులను అక్రమంగా ఉరవకొండ పోలీసులు నిర్భందించారు. వీరిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. పైగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్న ఆహార పానీయాలు లేకుండా ఇబ్బందులకు గురిచేశారు.
అరెస్ట్ చేసిన 24 గంటలలోపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాల్సి ఉండగా వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ బాధితులు గగ్గోలు పెట్టారు.