

మన న్యూస్: పాచిపెంట, నవంబర్ 26 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి వ్యవసాయ శాఖ సలహాలు తీసుకోవాలని కోరారు. కలుపు మందులలో అనేక రకాలు ఉంటాయని,పంట లేకుండా పిచికారి చేసేవి,పంటపై పిచికారీ చేసేవి,,అన్ని రకాల కలుపులను నివారించేవి, కొన్ని రకాల కలుపును మాత్రమే నివారించేవి, భూమిపై పిచికారి చేసేవి, పంటపై పిచికారి చేసేవి, ఇలా అనేక రకాలుగా ఉంటాయన్నారు.కాబట్టి తప్పనిసరిగా వ్యవసాయ సలహాలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు అన్నారు. మంగళవారం నాడు మండలం కర్రి వలస పంచాయతీ కంకణాపల్లి గిరిజన గ్రామం లో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో మాట్లాడుతూ వీలైనంతవరకు కలుపు మందులకు దూరంగా ఉండాలని గిరిజన గ్రామాలలో కూలీల కొరత ఉండదు కాబట్టి గొప్పులు తవ్వు కోవాలని కలుపు మందు ఎక్కువగా వాడడం వలన పర్యావరణం దెబ్బతింటుందని అన్నారు.అంతే కాకుండా రసాయన ఎరువులను పూర్తిగా విడిచి పెట్టాలని పశువులు ఎక్కువగా ఉన్నందున మూత్రం సేకరించి పొలాల్లో వేసుకోవడం ద్వారా భూమిని సారవంతం చేయొచ్చని తెలిపారు. అపరాలు మరియు చిరుధాన్యాల సాగును పెంచాలని వీలైనంతవరకు రసాయన ఎరువులను విడనాడాలని తెలిపారు. అనంతరం రైతులకు అపరాలకు విత్తనాలను పంపిణీ చేశారు. కర్రివలసలో కూరగాయల మోడల్ నిరంతర ఆదాయాన్నిచ్చే కూరగాయల మోడల్ ను కర్రి వలస ఐ సి ఆర్ పి సుమలత ఆధ్వర్యంలో వేయించారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ తక్కువ విస్తీర్ణంలో కూరగాయల మోడల్ ఏటీఎం మోడల్ అని ఈ మోడల్ ద్వారా తీగజాతి దుంప జాతి ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ రకాలు తక్కువ విస్తీర్ణంలో నిరంతరం పండించడం ద్వారా ప్రతిరోజు ఆదాయం పొందవచ్చుని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు మోహన్ కృష్ణ సిఆర్పి విజయ్ మరియు నరసింహమూర్తి పాల్గొన్నారు.
