

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : స్వతంత్ర సంగ్రామంలో అలుపెరగని పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని ఏలేశ్వరం మండల సిపిఎం కార్యదర్శి పాకలపాటి సోమరాజు కొనియాడారు. ఈమేరకు శుక్రవారం అల్లూరి సీతారామరాజు 128 జయంతి పురస్కరించుకుని మండలంలోని భద్రవరం, ఏలేశ్వరం గ్రామాల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నిర్వహించారు. స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆదివాసీల హక్కులపై చైతన్య స్ఫూర్తిని నింపిన మహా యోధుడు అల్లూరి అన్నారు. ఈ కార్యక్రమాలలో సి ఐ టి యు నాయకుడు పిల్లా రాంబాబు,గండి వెంకట్రావు, రౌతు సత్యనారాయణ,బత్తుల వీర్రాజు,గుగ్గిరాల రాంబాబు, బాలా త్రిపుర సుందరి, తదితరులు పాల్గొన్నారు.