

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డా. సర్వేపల్లి రాథాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను శుక్రవారం ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలం, పెద శంకర్లపూడి గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు శాసనసభ్యురాలు వరుపుల సత్య ప్రభ చేతులు మీద గా కిట్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, గత వైయస్సార్సీపి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ సరిచేస్తుందని అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల సిబ్బంది, అధికారులు, కూటమి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.