

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయితీ 4 వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు.ఈ సందర్బంగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభకు స్థానిక నాయకులు బొదిరెడ్డి గోపి,మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు.ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు,యువనేత నారా లోకేష్ ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య, మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి, కౌన్సిలర్లు ,ఎండగుడి నాగబాబు,కోణాల వెంకట రమణ, పెండ్ర శ్రీను, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ , శెట్టి చిన్న, జొన్నాడ వీరబాబు,బుద్ధ సూర్యప్రకాష్, అనంతారపు రాజు, గట్టెం రమణ, రెడ్డి రాజు, ఇల్ల అప్పారావు, బ్యాంకు రాజు, రాతికింది సతీష్, పలివెల శ్రీనివాస్, రుచి రమేష్ ,సూతి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.