మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్, జూన్ 27: మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో నిర్వహించిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ,ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను మండల ప్రత్యేక అధికారి అరుణ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాల స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఇంటిని నాణ్యతతో నిర్మించాలని లబ్ధిదారులకు సూచించారు. పనుల్లో అలసత్వం లేకుండా, పనితీరు పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు,కాంట్రాక్టర్లకు సూచించారు.అలాగే,బలహీన వర్గాల గృహ నిర్మాణం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.గ్రామీ ప్రాంత అభివృద్ధికి ఈ పథకం దోహదపడుతన్నారు. ప్రత్యేక అధికారి వెంట ఎంపీడీవో అనిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లయ్య గారి ఆకాష్, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ సింగ్,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *