గూడూరు, మన న్యూస్ :- భవిష్యత్తు తరాల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం అని, మంచి భవిష్యత్తు కొరకు ప్రజలు, విద్యార్థులు, యువత యాంటీ డ్రగ్స్ కి పూర్తిగా సహకరించాలని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఊహశ్రీ , గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు తదితరులు పేర్కొన్నారు.అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎక్సైజ్ మరియు పోలీసు శాఖ అధికారులు, విద్యార్థులతో కలసి నిర్వహించిన అవగాహన ర్యాలీలో వారు పాల్గొన్నారు.డ్రగ్స్ వినియోగంతో శారీరకంగానే కాకుండా మానసిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు.విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన ఉండి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐ లు, ఎస్సైలు , ఎక్సైజ్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *