మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 2 కోట్ల 28 లక్షల రూపాయలవ్యయం తో సాగునీటి కాలువల పూడికతీతలు మరమ్మత్తులకు పనులకు ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ,
ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం నగర పంచాయతీలో తిమ్మరాజు చెరువు ఆయకట్టుకు నీరు అందించే సాగునీటి కాలువలకు, రూరల్ మండలంలో లింగంపర్తిలో సాగునీటి కాలువలకు 38 లక్షల మరమ్మతులపనులకు ఎమ్మెల్యే వరుపులసత్యప్రభ,జనసేన నేత మేడిశెట్టి బాబి,స్థానిక నేతలు రైతులు,కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను విస్మరించిందని అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుందనితెలిపారు.ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం దశలో భాగంగా రైతులకు సాగుకు నీటి ఎద్దడి నివారణ దిశగా సాగునీటి కాలువలు మరమ్మత్తులకు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.ప్రత్తిపాడు మండలంలో గల సుబ్బారెడ్డి సాగర్ సాగినీటి కాలువలకు 66 లక్షలు రూపాయలతో మరమ్మతులు చేపట్టనున్నామని.శంఖవరం మండలంలో 53 లక్షల రూపాయలతో సాగినీటి కాలువలకు మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి బుజ్జి,నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య,కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి, మాజీ జెడ్పిటిసి జ్యోతుల పెదబాబు, సూతి బూరయ్య, పెంటకోట మోహన్, ఎండగుడి నాగబాబు,బుద్ద ఈశ్వర రావు,కరణం సుబ్రహ్మణ్యం,పలివెల శ్రీనివాస్, జిగటాపు సూరిబాబు,బసా ప్రసాద్,పలువురు కూటమి నేతలు రైతులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *