మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్:
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ పరిధిలో అవగాహన ర్యాలీ చేపట్టారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అవగాహన ర్యాలీలో నాలుగు మండలాల పోలీస్ ఇన్స్పెక్టర్లు, యన్ సీ సీ,పలు కాలేజీల విద్యార్థినీ విద్యార్థుల పాల్గొన్నారు.
ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు సుమారు వెయ్యి మందితో భారీ ర్యాలీ చేపట్టారు.డ్రగ్స్ వద్దు ఆరోగ్యం ముద్దు, డ్రగ్స్ ను తరిమికొడదాం యువతను కాపాడుదాం అంటూ నినాదాలు చేపట్టారు. అనంతరం ఎస్సార్ సెంటర్ నందు మనవహరంచేపట్టారు. సీఐ సూర్య అప్పారావు ప్రతిజ్ఞ చేపట్టారు.ఏ ప్రయోజనం కోసం ఏ విధంగానూ చట్టవిరుద్ధమైన హానికరమైన మాదకద్రవ్యాలను తీసుకోమని హామీ ఇస్తున్నామని ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఏలేశ్వరం అన్నవరం రౌతులపూడి ఎస్సై లు లక్ష్మీకాంతం, రామలింగేశ్వరరావు, శ్రీ హరిబాబు, వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు యన్ సీ సీ స్టూడెంట్స్, పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *