

మన న్యూస్ : కామారెడ్డి జిల్లా, భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామ శివారులోని ఈ నెల 20 మహిళను హత్య కేసులో ముగ్గురికి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపిన డిఎస్పీ నాగేశ్వర్ రావు. కామారెడ్డి డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ నాగేశ్వర్ రావ్ వివరాలు వెల్లడించారు. కంచర్ల గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో ఒంటరిగా పని చేస్తున్న మహిళ బల్లేముల సుగుణ తలపై కొట్టి హత్య చేసి, 3 తులాల బంగారు అభరనాన్ని దొగిలించిన కేసులో అల్లేపు మల్లయ్య అనే నిందితుడు విషయం బయటకు వస్తుందని భావించి ఈ నెల 22 న పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుని నిన్న మృతి చెందగా, మిగతా నిందితులు నవీన్, ప్రసాద్, సాలవ్వ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు. నిందితులు బీబీపేట్ మండలం యాడారం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుండి మూడు తులాల బంగారు ఆభరణాఎన్ని, ద్విచక్ర వాహనాన్ని స్వాదీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇదే రకమైన హత్యలు చేసిన కేసులో నిందితులపై గతంలో పలు కేసులు నమోదైనట్లు తెలిపిన డిఎస్పీ నాగేశ్వర్ రావు తెలిపారు. కేసు చేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అధికారులను డిఎస్పీ అభినందించారు.