Oplus_16777216
  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం ప్రిన్సిపల్ విశ్వేశ్వరరావు..

తుని మన న్యూస్ ప్రతినిధి (అపురూప్) :- శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ లో కాకినాడ జిల్లా తుని (లోవ కొత్తూరు) లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల లో చదివిన ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ కనిగిరి విశ్వేశ్వరరావు తెలియజేశారు. 2024-25 విద్యా సంవత్సరం లో 10వ తరగతి పరీక్షలకు 75 మంది విద్యార్థులు హాజరు కాగా 75 మంది ఉత్తీర్ణు లైనట్లు తెలియజేస్తూ, 13 మంది విద్యార్థులు 500 మార్కులకు పైబడి సాధించినట్లు తెలియజేశారు. 568 మార్కులు బక్కి నిఖిల్ సాధించగా, దడాల దినేష్ 567 మార్కులు సాధించారు. వీరికి శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ లో సీట్లు వచ్చాయని సహకరించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల సంస్థల కార్యదర్శి ప్రసన్న వెంకటేష్, అదనపు కార్యదర్శి సునీల్ కుమార్, జాయింట్ కార్యదర్శులు సంజీవరావు, మురళీకృష్ణ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ కనిగిరి విశ్వేశ్వరరావు, ఉపాధ్యాయ సిబ్బంది, తల్లిదండ్రులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *