రేణిగుంట ఆగష్టు 15.

రేణిగుంట మండల పరిధిలోని ఇన్ఫాంట్ జీసస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఎంతో ఉత్సాహంగా, ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ సౌమినీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవరెండ్ ఫాదర్ తలారి బాలరాజు గారు హాజరయ్యారు.

​ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఫాదర్ తలారి బాలరాజు మాట్లాడుతూ— “మన దేశ స్వాతంత్రం వెనుక ఎందరో మహానుభావుల త్యాగాలు, బలిదానాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ వంటి అమరవీరుల పోరాట పటిమను, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి” అని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

​పాఠశాల పి.ఇ.టి దీన దయాకర్ పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు దేశాభిమానాన్ని చాటే ఉపన్యాసాలు, దేశభక్తి గీతాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు విశేష సంఖ్యలో పాల్గొని ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక వేడుకలా జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *