మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్
:అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం బుధవారం అతిసార వ్యాధి నిరోధక అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యురాలు ఎం సౌభాగ్య సరోజ మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో తాగునీరు కలుషితం కావడం, ఈగలు వాలిన ఆహార పదార్థాలు తినడం కూడా కారణమని వైద్యులు పేర్కొంటున్నారు.అతిసార వ్యాధిని త్వరగా పరిష్కరించవచ్చు. భవిష్యత్లో రాకుండా నివారించుకోవచ్చు.బాత్రూమ్ను ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి.వంటచేసే ముందు,వంట చేసిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి.డైపర్స్ మార్చిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి.మరిగించిన లేక బాటిల్లోని ప్యూరిఫైడ్ నీటిని తాగాలి.వేడిగా ఉన్న పానియాలను తాగాలి.శిశువులకు,చిన్నపిల్లలకు వయస్సుకు తగిన ఆహారాన్ని ఇవ్వాలి.ఆరు నెలల వరకు తల్లిపాలను తప్పనిసరిగా ఇవ్వాలి.ఆహారాన్ని సక్రమంగా నిల్వ చేయాలి అన్నారు.ప్రధాన రహదారి పై వైద్య సిబ్బంది.అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ విజయలక్ష్మి,హెల్త్ అసిస్టెంట్ రాజేంద్రప్రసాద్,ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు, పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *