శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- పేదల పక్షాన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం లో శంఖవరం మండలం మరియు వివిధ గ్రామాలకు చెందిన 12 మంది కి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం ఆర్ ఎఫ్) లబ్ధిదారులకు రూ. 13,95,118 లక్షల విలువ చేసే చెక్కులను ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి టీడీపీ కార్యాలయం నందు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ మాట్లాడుతూ, అనారోగ్యం బారిన పడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించి, ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి నియోజవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. ప్రజల పక్షాన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, సూపర్ సెక్స్ పథకాలను అమలు చేసి ప్రజల మన్నలను పొందుతూ, మేధావులు పరిపాలిస్తే రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్, తెలుగుదేశం పార్టీ టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) టిడిపి సీనియర్ నాయకులు బద్ది రామారావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు సాధనాల లక్ష్మీ బాబు, కంచిబోయిన శ్రీను తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *