Oplus_16777216

తుని మన న్యూస్ (అపురూప్):- రాష్ట్రంలోని డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 వ తరగతుల్లో మిగిలిన సీట్ల అడ్మిషన్ల కోసం ధరఖాస్తులను చేసుకోవాలని తుని అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ కనిగిరి విశ్వేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. తుని అంబేద్కర్ గురుకులం పాఠశాలలో మరియు ఆయా పాఠశాలల్లో ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 25వ తేదీ (25 జూన్ 2025 )పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎస్సి, ఎస్టీ, బీసీ వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.6. వ తరగతి 3,095, 7. వ తరగతి 1255, 8. వ తరగతి 882, 9. వ తరగతి 875రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ సీట్లలో భర్తీ చేయడం జరుగుతుందన్నారు.గురుకుల పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు మరియు ప్రవేశ పరీక్షల తేదీలు ఇటువలె ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టట్యూషన్ సొసైటీ ప్రధాన కార్యాలయం నుండి ఖరారు చేశారన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులకే అడ్మిషన్ అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇతరులు ప్రవేశానికి అర్హులు కారని,. పరీక్షా తేదీలు మరియు వివరాలుప్రకటించడం జరిగిందన్నారు.1. 5వ తరగతికి (ఆడ పిల్లల కోసం) స్పాట్ అడ్మిషన్ తేదీ: 22.06.2025 వేదిక: ఎస్‌.ఎమ్‌.నగర్, కాకినాడ2. 5వ తరగతికి (అబ్బాయిల కోసం) స్పాట్ అడ్మిషన్  తేదీ: 23.06.2025  వేదిక: ద్రాక్షారామం3. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు (ఆడ పిల్లల కోసం) ప్రవేశ పరీక్ష  తేదీ: 25.06.2025  వేదిక: ఎస్‌.ఎమ్‌.నగర్,కాకినాడ4. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు (అబ్బాయిల కోసం) ప్రవేశ పరీక్ష  తేదీ: 25.06.2025  వేదిక: ఎల్‌.ఎన్‌.పురం5. జూనియర్ ఇంటర్ తరగతికి (ఆడ పిల్లల కోసం) స్పాట్ అడ్మిషన్  తేదీ: 26.06.2025  వేదిక: పి.వెంకటాపురం6. జూనియర్ ఇంటర్ తరగతికి (అబ్బాయిల కోసం) స్పాట్ అడ్మిషన్  తేదీ: 27.06.2025  వేదిక: ద్రాక్షారామం ఆయా ప్రదేశాలలో పరీక్షలో నిర్వహించడం జరుగుతుందని దరఖాస్తులు చేసుకున్న వారు పరీక్షకు హాజరుకావాలని తుని అంబేద్కర్ గురుకులం ( బాయ్స్) ప్రిన్సిపాల్ కనిగిరి విశ్వేశ్వరరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *