పల్లె పండుగ తో గ్రామాలకు మహర్దశ…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,ఇందుకూరుపేట:- గంగపట్నంలో ఘనంగా ప్రారంభమైన పల్లెపండుగ- పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- సీఎం చంద్రబాబు , పవన్‌ కళ్యాణ్ సహకారంతో ప్రజలకు వసతులుపల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాలకు మహార్దశ ఏర్పడిందని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో పల్లెపండుగ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. 20 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. అలాగే జల్‌జీవన్‌ మిషన్‌ కింద 38.7 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ కు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామాలలో మౌలిక వసతులు ఏర్పడుతున్నాయన్నారు. రోడ్ల దగ్గరి నుంచి డ్రెయిన్ల వరకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. గతంలో తట్ట మట్టి వేసిన దాఖలాలు లేవని విమర్శించారు. అన్ని గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే స్పౌజ్ పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అందించనున్నామని చెప్పారు. చాలామంది గ్రామస్తులు ఇంటి నిర్మాణం అంశాలను ప్రస్తావిస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. గత ఐదేళ్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ ను సర్వ నాశనం చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎక్కడా అన్యాయం జరగదని, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆమె హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు. షైనింగ్‌ స్టార్ కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తూ నగదు పురస్కారాలు అందించడం గొప్ప విషయమన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్య అభివృద్ధి చెందుతుందన్నారు. ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు విధానాన్ని అమలు చేయనున్నారని చెప్పారు. అనంతరం గంగపట్నం చాముండేశ్వరి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందించారు. గంగపట్నం అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ఉత్సవాలకు వచ్చిన భక్తులకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మండలపార్టీ అధ్యక్షులు vc వీరేంద్ర నాయుడు, టీడీపీ నేతలు దువ్వూరు కల్యాణ్‌రెడ్డి, కోడూరు కమలాకర్‌రెడ్డి, చెంచు కిషోర్‌, బొద్దుకూరు సుధాకర్‌, రామచంద్రనాయుడు, సుధాకర్‌రెడ్డి, కృష్ణ, సుధీర్‌, జనార్థన్‌ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    శంఖవరం/ రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబాన్ని గుర్తించి మేమున్నాం అంటూ గంగవరం గ్రామ ఆడపడుచులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఇంకా మానవత్వం బతికే ఉన్నాది అనేదానికి ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..