మన న్యూస్, నెల్లూరు:పిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా,అసహ్యంగా ఆలోచిస్తున్నారు…. జనసేన నేత గునుకుల కిషోర్సెక్యులరిజం గురించి బాధపడే నారాయణ సనాతన ధర్మం క్రూరమైనది అన్నట్లే ముస్లిం మతస్తులను, క్రైస్తవ మతస్థులు అనగలిగే దమ్ముందా..? అని అన్నారు.పనిచేసే వారిని కూలీలు అనకండి శ్రామికుల నుండి అని గవర్నమెంట్ ఆర్డర్లో మార్పులు చేస్తూ పవన్ కళ్యాణ్ సమాజ ప్రక్షాళన చేస్తుంటే వారిని వ్యక్తిగతంగా దూషించేందుకు మీకు మనసెలా వచ్చింది అని అన్నారు.కమ్యూనిటీ పార్టీలను కలుపుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ మాకు తెలియజేసిన భావజాలాలు మీకు మీలో ఇంకా బతికే ఉన్నాయా…?ఉన్నాయి అని నేను అనుకోవడం లేదు అని అన్నారు.నాకు తెలిసినంతవరకు కమ్యూనిస్టు పార్టీలు అంటే పేదల కోసం పోరాడేవి అని నా చిన్ననాటి రోజులు.ఈ రోజున బడుగు బలహీన వర్గాలకి మంచినీటి కనీస అవసర సౌకర్యాలు కల్పిస్తూ తండావాసులను సైతం రోడ్లు వేయిస్తూ గిరిజనుల ప్రాంతాల్లో కరెంటు లైట్లు వెలిగిస్తూ ముందుకు పోతున్న పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించిన మీరు నేటి యువతకి నీచంగా వికృతంగా కనబడుతున్నారు… అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *