

మన న్యూస్, నెల్లూరు: నెల్లూరు డైకాస్ రోడ్డులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజితతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బేటీ అయ్యారు.ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ పూజిత తో పలు విషయాలను చర్చించారు. చంద్రశేఖర్ రెడ్డి వెంట వైఎస్ఆర్సిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్, ఊటుకూరు నాగార్జున, వై సి పి యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ళ కిషన్, 11 వ డివిజన్ ఇన్ చార్జ్ మహేష్ యాదవ్, వైసిపి నాయకులు బాలకృష్ణారెడ్డి, సింగంశెట్టి అశోక్, పెంచలయ్య, సుమధర్ తదితరులు పాల్గొన్నారు.


