నెల్లూరులో చివరి దశకు చేరుకున్న విఆర్ హైస్కూల్ ఆధునికరణ పనులు

చివరి దశకు చేరుకున్న విఆర్సీ హై స్కూల్ ఆధునీకరణ పనులు మన న్యూస్ ,నెల్లూరు ,జూన్ 7:- వి ఆర్ హైస్కూల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన పొంగూరు షరణి – రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మహా సంకల్పంతో విఆర్ఐ స్కూల్ రూపురేఖలు మార్పు – మంత్రి లోకేష్ ఆశయం అదే – పేద విద్యార్థులకు ఇంటరాక్టివ్, డిజిటల్ విద్యను అందించడమే లక్ష్యం పేద విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని మహా సంకల్పంతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సంకల్పించిన వి ఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నట్లు మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి తెలిపారు. కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నేలా సిద్దమౌతున్న పేదపిల్లల పాఠశాల వి ఆర్ హైస్కూల్ ను ఆమె పరిశీలించారు. పనుల పురోగతిని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి తరగతి గదికి వెళ్లి ఏర్పాటు చేసిన వసతులను, ఫర్నిచర్ ను, ప్లే గ్రౌండ్ ను పరిశీలించారు. పనులు నాణ్యవంతంగా వేగంగా చేస్తున్న ఎన్సిసి సిబ్బందిని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా పొంగూరు షరణి మాట్లాడుతూ….. వెంకటగిరి రాజా గార్ల సహాయంతో విఆర్సీని అభివృద్దిచేసారన్నారు. 1975 లో మహోన్నత ఉద్దేశంతో ఏర్పాటు చేసిన విఆర్సీకి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులను, వ్యాపార వేత్తలను , మేధావులను సమాజానికి అందించిందన్నారు. అంతటి చరిత్ర ఉన్న వీఆర్సీ హై స్కూల్ ను వైఎస్సార్సీపీ హయాంలో మూత వేయడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ సహకారంతో వీఆర్సీ పునః ప్రారంభానికి మా నాన్న నారాయణ సంకల్పించారని తెలియజేశారు. ఆ మేరకు ఆధునీకరణ పనుల బాధ్యత తనకు అప్పగించారని చెప్పారు. పేద విద్యార్థులకు ఇంటరాక్టివ్ , డిజిటల్ విద్యను ఈ ఏడాది నుంచి అందించబోతున్నట్లు వెల్లడించారు. ఏపీ ని డిజిటల్ ఇండియా చేయాలన్నది మంత్రి లోకేష్ బాబు ఆశయం అని తెలియజేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇంటర్ నేషనల్ స్కూల్స్ లో ఉండే స్టాండర్స్ ఇక్కడ ఉంటాయని చెప్పారు. P4 కింద ఇరవై మంది విద్యార్థుల కుటుంబాలను దత్తత తీసుకొంటున్నానని ప్రకటించారు. పేదపిల్లల కోసం జరుగుతున్న యజ్ఞంలో భాగస్వామిని కావటం అదృష్టంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నారాయణా విద్యాసంస్థల ఇంచార్జిలు ,ఎన్సీసీ మేనేజర్ లు పాల్గొన్నారు .

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!