మన న్యూస్, గూడూరు : తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే సహకారంతో చిల్లకూరు, గూడూరు, చెన్నూరు, వాకాడు లో ఉన్నటువంటి 15 స్కూల్స్ కి ఎంఈఓ రవూఫ్ చేతుల మీదుగా స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం జరిగింది.అనంతరం వేగూరు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారుల కోరిక మేరకు స్టేడియం లో నూతన గ్యాలరీ, ఓపెన్ జిమ్, మరియు ప్రహరీ గోడలకు పెయింటింగ్ వేసి స్టేడియంని అభివృద్ధి చేయడం జరిగిందని అందుకు క్రీడాకారులందరూ కూడా ఎమ్మెల్యే గారిని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా స్కూల్స్ ప్రారంభించిన తర్వాత పిల్లలకి ఆడుకోవడానికి అవసరమైన స్పోర్ట్స్ కిట్స్ అందించాలని ఎమ్మెల్యే 15 స్కూల్స్ ఎంపిక చేసుకొని వారికి స్పోర్ట్స్ కిట్స్ అందించడం జరిగింది అన్నారు .ఎమ్మెల్యే 15 స్కూల్స్ కి స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం చాలా మంచి పరిణామం అని అన్ని స్కూల్స్ పి.డి/ పి ఈ టి లు సంతోషాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, సుమన్ రెడ్డి, శర్మ, వెంకటేశ్వర్లు, లవ కుమార్, రవూఫ్, పీడీలు కోటేశ్వరయ్య, శ్రీనివాసులు, పి వెంకటరమణ , చంద్ర, చిన్న, శివయ్య , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *