మన న్యూస్, నెల్లూరు రూరల్ ,జూన్ 5: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారాషాహీద్ దర్గాలో ఈ నెల 7వ తేదీన జరగనున్న బక్రీదు వేడుకలను పురస్కరించుకొని చేయవలసిన ఏర్పాట్లపై గురువారం నెల్లూరు నగర మునిసిపల్ కమీషనర్ వై.ఓ. నందన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. పవిత్ర బారాషాహీద్ దర్గాలో బక్రీదు పండుగ సందర్భంగా జరిగే ప్రార్ధనలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. పవిత్ర బారాషాహీద్ దర్గాలో బక్రీదు పండుగ సందర్భంగా పార్ధనలు నిర్వహించే భక్తులకు అవసరమైన మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్న నగర మునిసిపల్ కమీషనర్ వై.ఓ. నందన్ కి మరియు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో బారాషాహీద్ దర్గా కమిటీ మెంబర్లు, ముస్లిం మత పెద్దలు, మైనారిటీ నాయకులు, స్థానిక టీడీపీ నాయకులు మరియు పోలీసు, నగర కార్పొరేషన్ అధికారులు, ఎలక్ట్రికల్ శాఖ అధికారులు, పబ్లిక్ హెల్త్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *