ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో వద్ద విషాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత

మన న్యూస్,నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) క్రికెట్ ఆడి ఎండవేడిమి తట్టుకోలేక నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు సోమవారం గల్లంతయ్యారు. బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం ..ఎల్లారెడ్డి మండలానికి చెందిన పది మంది యువకులు సోమర్ పేట్ సమీపంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, అలసిపోయిన యువకులు సేదతీరేందుకు మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులో పిప్పిర్యాగడి తండా నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఈత కొట్టాలని నిర్ణయించుకున్నారు.అయితే ప్రమాదవశాత్తు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోతు అంచనా వేయలేకపోవడం వల్ల ముగ్గురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. యువకులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్ ,పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు.రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలించగా మంగళవారం ఉదయం ఒక మృతదేహం మధ్యాహ్నం సమయంలో రెండు మృతదేహాలను వెలికి తీశారు.మొత్తం ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన మధుకర్ గౌడ్ (18), తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ (25), సోమర్ పేట్ గ్రామానికి చెందిన హర్షవర్ధన్(17)గా గుర్తించారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లభ్యమైన ముగ్గురు యువకుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్,ఎస్ఐ శివకుమార్ తెలిపారు. సంఘటన స్థలానికి మాజీ జెడ్పిటిసి గయాజుద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిబాబా, నాయకులు సామెల్, విద్యాసాగర్ తదితరులున్నారు,

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు