మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎక్కడైనా మొరం, ఇసుక ,గాని తవ్వకాలు చేపడితే అధికారుల నుంచి మైనింగ్,రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులోని పిప్పి రేగడి తాండ సమీపంలో ప్రాజెక్టులో అనుమతి లేకుండా జెసిబి టక్టర్లలో నింపి పొలానికి వేసి చదును ఇష్టారాజ్యంగా చేస్తున్నారని తాండావాసులు బాన్సువాడ సబ్ కలెక్టర్,జిల్లా కలెక్టర్ కు, నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు మేరకు రెవెన్యూ ఆర్ ఐ పండరి సంఘటన స్థలానికి చేరుకొని అనుమతి లేకుండా తవ్వుతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించి జెసిబి ట్రాక్టర్లను పంపించారు. తాండవాసులు చెప్పిన వివరాల ప్రకారం మొరంను ట్రాక్టర్లతో తవ్వి గుంతలు చేయడం వల్ల గ్రామంలోని పశువులు వెళ్లి గోతులో పడి ప్రమాదం పొంచి ఉంటుందని వారు తెలిపారు. నీటి పరుదల శాఖ ఏఈ శివకుమార్ మన న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా ఆయన ఫోను లిఫ్ట్ చేయలేదు, నీటి పారుదల శాఖ ఈఈ మన న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా సంప్రదింగా ఆయన మీరు ఫోన్ చేస్తేనే మాకు తెలుసు మాకు ఎలాంటి సమాచారం లేదు అలా అక్రమమొరం తవ్వుతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.ఇదండీ అధికారుల పని విధంగా ఉందో తెలుసుకోగలరు.

oplus_2

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *