Oplus_16777216

బద్వేల్: మన న్యూస్: మే 29: బద్వేల్ మండలం తొట్టిగారి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వనంపుల సచివాలయం నందు రుతుక్రమము ఆరోగ్యము పరిశుభ్రత దినోత్సవ కార్యక్రమం డాక్టర్ జె వినయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ జె వినయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మే నెల 28వ తేదీన రుతుక్రమము ఆరోగ్యము పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం ఉంటుందని, ముఖ్యంగా బహిష్ట సమయంలోను పరిశుభ్రంగా ఉండి బ్యాక్టీరియర్లు మరియు వైరస్ ద్వారా వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటెడ్ బి వెంగయ్య పాల్గొని ప్రజలకు మరియు విద్యార్థిని విద్యార్థులకు రుతు చక్రం గురించి మరియు బహిష్ట సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు సానిటరీ నాప్కిన్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ ఏఎన్ఎం సి రమాదేవి, సచివాలయ సిబ్బంది, అంగనవాడి టీచర్, ఆశా కార్యకర్తలు, మరియు మహిళలు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *