

మన న్యూస్ ,కోవూరు : *రాజకీయాలకు కొత్త అయిన ఎన్టీఆర్, 40 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన పథకాలు, నేడు దేశం అంతా అమలువతున్నాయంటే, అదే ఆయన గొప్పతనం.*పేద వాడికి కనీసావసరాలైన కుడు, గుాడు , గుడ్డ ఇవ్వడమే నా సిద్ధాంతం అని చెప్పి, ఆచరణలో చూపించిన గొప్ప మానవతావాది.*ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన వృద్ధాప్య, వితంతు,వికలాంగులకు పెన్షన్లు నేడు దేశమంతా అమలవుతున్నాయి.*తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ తో కలసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది.*కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ కూ భారతరత్న అవార్డు ప్రకటించాలి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102 వ జయంతి సందర్భముగా, కోవూరు లోని చేజర్ల వేంకటేశ్వర రెడ్డి కార్యాలయంలో, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…….స్వర్గీయ నందమూరి తారక రామారావు నటుడిగా,నిర్మాతగా,దర్శకుడిగా ఎవరూ సాధించలేనన్ని విజయాలు సాధించారు.సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు అని అన్నారు.తెలుగుదేశం పార్టీని స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు,రాజకీయాలకు కొత్త అయిన 40 సంవత్సరాల క్రితం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, నేడు దేశం అంతా అమలువతున్నాయంటే ,అదే ఆయన గొప్పతనం కు నిదర్శనం అని అన్నారు.పేద వాడికి కనీసావసరాలైన కుడు, గుాడు , గుడ్డ ఇవ్వడమే నా సిద్ధాంతం అని చెప్పి, ఆచరణలో చూపించిన గొప్ప మానవతావాది అని అన్నారు.నేడు ప్రపంచ దేశాలు మాటడుతున్న ఆహారభద్రత ఆవశ్యకతను1982 లోనే గుర్తించిన మొట్టమొదటి నాయకుడు ఎన్టీఆర్.1983 వరకూ వరి అన్నం అనేది కొన్ని వర్గాలకు,కొన్ని ప్రాంతాలకు పరిమితమైన రోజుల్లో రూ 2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి ప్రతి పేదవాని ఆకలి తీర్చారు అని అన్నారు.పేదవారి కోసం దేశంలోనే ప్రప్రథమంగా పక్కాఇల్లు కటించి ఇవ్వాడమే కాకుండా,ఇంజనీరింగ్,మెడికల్ కళాశాలలో ఉన్న క్యాపిటేషన్ ఫీజు విధానాన్ని రద్దు చేసి ఎంసెట్ విధానాన్ని ప్రవేశపెట్టి పేదవారు కూడా ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యే అవకాశం కల్పించారు అని అన్నారు.మహిళల కు ఆస్తిలో సమాన హక్కు కల్పించి,వారికి మరియు బిసిలకు స్థానిక సమస్థలల్లో రిజర్వేషన్లు కల్పించారు అని అన్నారు.తమిళనాడు కు త్రాగునీరు ఇచ్చే పథకం ను రైతులకు ఉపయోగపడే విధంగా మార్పులు చేసి,తెలుగుగంగ ప్రజాక్టు ను రూపొందించి, దానిలో భాగంగా సోమశిల ప్రాజెక్టు ను విస్తరించి,కండలేరు డ్యాం నిర్మించి నెల్లూరు జిల్లాల్లో 2.5 లక్షలు ఎకరాలకు సాగునీరు అందించిన రైతు భాంధవుడు ఎన్టీఆర్ అని అన్నారు.రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎన్టీఆర్ కు సాటి రాగల నాయకుడు మరొకరు లేరు.అటువంటి గొప్ప నాయకుడి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విద్యార్థి నాయకునిగా పనిచేసే అవకాశం నాకు రావడం నిజంగా నా అదృష్టం అని అన్నారు.తెలుగుజాతికే కాకుండా దేశానికే ఎనలేని సేవలు అందించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు కి కేంద్ర ప్రభుత్వం వెంటనే భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ,ఆయన జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాను అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంతంగి రాము,కలికి సత్యనారాయణ రెడ్డి,ఇంటూరి విజయ్ కుమార్,ఇందుపూరు మురళీ కృష్ణ రెడ్డి,కుక్కటి గోపాల్, దువ్వూరు రంగారెడ్డి,sk మహ్మద్, గోర్రిపాటి నరసింహరావు, వేమయ్య,వేణుగోపాల్,పూల రాంబాబు,సోనగిరి బాబు,sk కలీల్, నారాయణ,కాకి భగవాన్,పుల్లూరు మధన్ మోహన్, తాళ్ళపాక లక్ష్మయ్య, చల్లా మురళి తదితరలు పాల్గొన్నారు.


