

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం :దక్షిణ కాశీ గా వెలుగుతున్న జొన్నవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ కామాక్షి దేవి,మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల లో భాగంగా నేడు జరిగిన కళ్యాణోత్సవం లో పల్లకి సేవ లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……భక్తులు చీడపీడలు తొలగిస్తూ,వారి కోరికలను తీరుస్తూ, స్వప్న దర్శనమిస్తూ భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతున్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్ల కళ్యాణంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది.ఈ స్థల పురాణం ఎంతో ఉంది.త్రేతా యుగంలో కుష్టి వ్యాధిగ్రస్తుడైన అశ్వద్ధామ పినాకిని నది లో స్నానం చేసి స్వస్థత పొందినట్లు పురాణాలు చెందుతున్నాయి.అదేవిధంగా అసురుని వేధింపులు తట్టుకోలేక జొన్నవాడ కి చేరి ఇంద్రుడు పెన్నా నదిలో స్థానమాచరించి కామాక్షి తాయని సేవించడంతో పునీతులు అవ్వడమే కాకుండా రాక్షస బాధలనుంచి విముక్తుడైనారు అని కూడా స్థల పురాణం చెబుతుంది.వేడుకలా జరిగిన ఈ బ్రహ్మోత్సవాల లో భక్తుల కోర్కెలన్నీ తీరి సుఖసంతోషాల తో వర్ధిల్లాలని కూటమి ప్రభుత్వం నాయకులు సుభిక్షమైన పరిపాలన అందిచాలని కోరుకున్నారు.
