

మన న్యూస్, కోవూరు:కడపలో మే27,28,29 తేదీలలో జరుగు తెలుగుదేశం పండుగ “మహానాడు”కు, కోవూరు నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ కమిటీల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, యూనిట్ ఇంచార్జి లు, బూత్ కన్వీనర్లు, కుటుంబ సాధికారిక సారథులు మరియు కార్యకర్తలు అందరూ ఈ “మహానాడు” కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అందరికీ నా ఆహ్వానం.ముఖ్య గమనిక:ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీ సభ్యత్వ కార్డు తీసుకుని రాగలరని మనవి.మహానాడుకు విచ్చేసిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వారి గ్రామాలకు చేరే వరకు నాయకులు జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నాను అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
