తిరుమ‌ల త‌ర‌హాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

  • పంచ‌మితీర్థానికి విస్తృతంగా ఏర్పాట్లు
  • టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు

Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలను నవంబరు 28 నుంచి డిసెంబ‌ర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు అధికారులను ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గురువారం సాయంత్రం ఆయ‌న బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుచానూరు బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన పంచ‌మి తీర్థం రోజు భ‌క్తుల‌కు చ‌క్క‌టి ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. హోల్డింగ్ పాయింట్ల‌లో ఉండే వేచి ఉండే భక్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా మంచినీరు, అల్పాహారంతో పాటు మ‌రుగుదొడ్ల‌ను కూడా అందుబాటులో ఉంచేందుకు ముంద‌స్తుగానే ప్ర‌ణాళిక చేసుకోవాల‌న్నారు. హోల్డింగ్ పాయింట్ల వ‌ద్ద అవ‌స‌ర‌మైన సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌న్నారు.
ఆరోగ్యశాఖ అధికారులు పారిశుద్ధ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని స్థానిక పంచాయ‌తీ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. వైద్య విభాగం అధికారులు ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాల‌ను, అంబులెన్సుల‌ను ఏర్పాటు చేసి అవ‌స‌ర‌మైన సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌న్నారు. సెక్యూరిటీ విభాగం అధికారులు సీసీ కెమెరాల‌ను, అవ‌స‌ర‌మైనంత సిబ్బందిని ఏర్పాటు చేసుకుని స్థానిక పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ఆదేశాంచారు.
భ‌క్త‌లంద‌రికీ అన్న‌ప్ర‌సాదం విరివిగా అందేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు. హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ద్వారా నిర్వ‌హించే స్టేజ్ కార్య‌క్ర‌మాలు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నాణ్య‌మైన‌విగా ఉండాల‌ని సూచించారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో వైట్ వాష్‌, క‌ల‌ర్ పెయింటింగ్‌, ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. ముఖ్య‌మైన ప్రాంతాల్లో ఆర్చిలు ఏర్పాటు చేసి హారితి పాయింట్స్ కోసం లైన్ లు, బారికేడ్లు, చైన్ లింక్ ల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. ఉద్యాన‌వ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుచానూరులో ఫ‌ల‌, పుష్ఫ ప్ర‌ద‌ర్శ‌న‌ను భ‌క్తులు ఆక‌ట్టుకునేలా ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.
ఈ స‌మావేశంలో జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ‌ధ‌ర్‌, ఎఫ్ఏసీఏఓ బాలాజీ, సిఈ స‌త్య‌నారాయ‌ణ‌, డిప్యూటీ ఈవో ఈవో గోవింద రాజన్, ఇతర త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం,…

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.