

Mana News :- పాచిపెంట, నవంబర్ 21( మన న్యూస్ ):- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో రక్తహీనత నివారణకు మునగాకు ఎంతో ఉపయోగపడుతుందని పాచిపెంట ఐసిడిఎస్పిఓ బి అనంతలక్ష్మి హితవు పలికారు. గురువారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలకు సుమారు 500 మునగ మొక్కలు పాచిపెంట ఎంపీడీవో చేతులు మీదుగా కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మునగాకు వలన వచ్చే ఉపయోగాలు గురించి వివరించారు. రక్తహీనతతో పాటు ఎముకలు బలము కోసము మునగాకు వండుకొని తీసుకోవాలనికోరారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్త తమ తమ అంగన్వాడీ సెంటర్ల వద్ద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. పెరిగి పెద్దయిన తర్వాత మునగాకు గర్భిణీలకు, బాలింతలకు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా 140 అంగన్వాడి కేంద్రాలకు గాను 400 మొక్కలు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమానికి ఎంపీడీవో తో పాటు ఉపాధి సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.