మన న్యూస్ సింగరాయకొండ:-

ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీ షేక్ ఖాజా మొహిద్దీన్ ఆధ్వర్యంలో మధ్యపాన వ్యసనం వల్ల దుష్ఫలితాలు దానివలన సమాజంలో ఎదురయ్యే సమస్యలు వ్యసన విముక్తికి గల అవకాశాలను గురించి తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా బాలాజీ నగర్ సింగరాయకొండ మెడికల్ ఆఫీసర్ Dr. చైతన్య వ్యసనం నుండి విముక్తి పొందాలనీ,వ్యసనపరులను ఒంగోలు నందలి ప్రభుత్వ రిమ్స్ హాస్పటల్ నందు డి అడిక్షన్ సెంటర్లలో చేర్పించినచో వారు వ్యసన విముక్తికై అన్ని విధాల తోడ్పాటు అందిస్తారని తెలియజేశారు.
ప్రకాశం జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఖాజా మొహిద్దీన్ మాట్లాడుతూ మద్యపాన వ్యసనం వల్ల వ్యక్తులు కుటుంబము ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక ఇబ్బందులను గురించి కూలంకషంగా ప్రసంగించారు.అదేవిధంగా స్వచ్ఛంద సంస్థకు చెందిన స్వప్న, హజరతయ్య పోలీస్ ఇన్స్పెక్టర్, వ్యసనం నుండి విముక్తి పొందే వారికి అందించే మద్దతు, అవకాశాలను గురించి విపులంగా ప్రసంగించారు
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ షేక్ ఖాజా మొహిద్దీన్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్, ఎర్ర వెంకట్ సీఐలు హజరతయ్య, M. శివకుమారి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్,ఎస్సై లు మహేంద్ర, రాజశేఖర్ నాయుడు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *